News August 9, 2025
APL: అమరావతి రాయల్స్ విజయం

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 తొలి మ్యాచులో అమరావతి రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 229/5 స్కోర్ చేసింది. KS భరత్ (93), సాయి రాహుల్ (96) రాణించారు. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్‌ను DLS ప్రకారం 14 ఓవర్లలో 173కి కుదించారు. అమరావతి జట్టు 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. హనుమ విహారి (17 బంతుల్లో 39 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
Similar News
News August 9, 2025
గురుకుల స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: రక్షాబంధన్ సందర్భంగా ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్(VHP) డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా టీచర్లు, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆత్మీయంగా చేసుకునే రాఖీ పండుగ సందర్భంగా వాళ్లను ఇళ్లకు పంపాలని కోరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు లేఖ రాసింది.
News August 9, 2025
ఆడపడుచులకు సీఎంల రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు CMలు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీ అందరికీ అన్నగా రక్షణ కల్పించి, జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలూ పనిచేస్తా’ అని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. స్త్రీలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది’ అని TG CM రేవంత్ రెడ్డి అన్నారు.
News August 9, 2025
దివ్యాంగులు, బాలికలతో స్పెషల్ హెల్ప్ గ్రూపులు

TG: మహిళా సంఘాల తరహాలో దివ్యాంగులు, బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దివ్యాంగుల్లో స్త్రీ, పురుషులతో సంఘాలు ఏర్పాటు చేసి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందించనున్నారు. వ్యాపారాల కోసం రుణాలు ఇస్తారు. అటు 15-18 ఏళ్ల బాలికలతో SHGలు ఏర్పాటు చేసి నగదు పొదుపు, SM మోసాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 11 నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.