News August 9, 2025
సిద్దిపేట: గంజాయి అమ్మడానికి ప్రయత్నం.. ఇద్దరి అరెస్ట్

గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట 3వ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మిట్టపల్లికి చెందిన సిద్దరబోయిన అఖిల్ (21) పవన్ కుమార్ (20) శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంచార్ పల్లి, బక్రీ చేప్యాల శివారులో గంజాయి అమ్మడానికి ప్రయత్నించారు. నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, 3వ టౌన్ SI చంద్రయ్య వెళ్లి పట్టుకున్నారు.
Similar News
News August 9, 2025
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండొద్దు: కలెక్టర్

శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండవద్దని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 9, 2025
వరంగల్: మా అక్క మనసు మంచిది..!

మీరు పైన చూస్తుంది ‘పెళ్లై 40 ఏళ్లు.. అయినా రాఖీ మిస్ అవ్వను!’ అనే వార్తకు వచ్చిన <<17345550>>కామెంట్<<>> ఇది. హనుమకొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన అక్కతో ఉన్న బంధాన్ని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘రవాణా వ్యవస్థ లేని రోజుల్లో ఏ రాత్రికో, తెల్లవారుజామునో వచ్చి అక్క రాఖీ కట్టేది. మంచి మనసుతో మా అక్క 45 ఏళ్లుగా రాఖీ కడుతోంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నా’ అని ఓ తమ్ముడు ఎమోషనల్ అయ్యాడు.
News August 9, 2025
అల్లూరి: చెల్లిపోని బంధం మీదమ్మా!

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.