News August 9, 2025
EP31: కుటుంబ పెద్ద ఇలా నడుచుకోవాలి: చాణక్య నీతి

కుటుంబం బాగుండాలంటే కుటుంబ పెద్ద కొన్ని సూత్రాలు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల మాటలకు ప్రభావితం కాకూడదు. పుకార్లను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇంటి సభ్యులతో స్పష్టంగా మాట్లాడాలి. డబ్బును వృథా చేయవద్దు. ఇంట్లో వారికి డబ్బు నిర్వహణపై అవగాహన కల్పించాలి. కుటుంబంలో అందరినీ సమానంగా చూడాలి. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. కుటుంబ సంక్షేమం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని బోధిస్తోంది.
Similar News
News August 9, 2025
రాఖీ పండగ.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

రాఖీ పండగ వేళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,03,040కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేట్ రూ.250 తగ్గి రూ.94,450గా ఉంది. సిల్వర్ రేట్ కేజీకి రూ.1,27,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News August 9, 2025
ఒకే వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉండొచ్చా?

దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలామంది రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారని AICC అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తికి ఒకే EPIC (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు) ఉండాలి. ఒక వ్యక్తి పేరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఉండాలి. వేరే ప్రాంతానికి మారినప్పుడు కొత్త ఓటరు కార్డు లభిస్తుంది. అలాంటప్పుడు ఫామ్ 7 ద్వారా పాత కార్డును రద్దు చేసుకోవాలి. రెండు చోట్లా ఓటు వేయడం చట్టరీత్యా నేరం.
News August 9, 2025
మతం దాచి పెళ్లి చేసుకుంటే జైలుకే.. హరియాణా చట్టం

మతాన్ని దాచి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా ₹4లక్షల జరిమానా, పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. చట్టబద్ధంగా అనుమతి పొందాకే మత మార్పిడి చేసుకోవాలంది.