News August 9, 2025

HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్

image

HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.60% నుంచి 8.55%కి, 3 నెలలకు 8.65% నుంచి 8.60%కి, 6 నెలలకు 8.75% నుంచి 8.70%కి, ఏడాది MCLR 9.05% నుంచి 8.75%కి తగ్గింది. ఈ తగ్గింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి రాగా లోన్ల EMI చెల్లించే వారికి స్వల్ప ఊరట దక్కనుంది.

Similar News

News August 9, 2025

రాఖీ పండగ.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

image

రాఖీ పండగ వేళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,03,040కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేట్ రూ.250 తగ్గి రూ.94,450గా ఉంది. సిల్వర్ రేట్ కేజీకి రూ.1,27,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News August 9, 2025

ఒకే వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉండొచ్చా?

image

దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలామంది రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారని AICC అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తికి ఒకే EPIC (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు) ఉండాలి. ఒక వ్యక్తి పేరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఉండాలి. వేరే ప్రాంతానికి మారినప్పుడు కొత్త ఓటరు కార్డు లభిస్తుంది. అలాంటప్పుడు ఫామ్ 7 ద్వారా పాత కార్డును రద్దు చేసుకోవాలి. రెండు చోట్లా ఓటు వేయడం చట్టరీత్యా నేరం.

News August 9, 2025

మతం దాచి పెళ్లి చేసుకుంటే జైలుకే.. హరియాణా చట్టం

image

మతాన్ని దాచి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా ₹4లక్షల జరిమానా, పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. చట్టబద్ధంగా అనుమతి పొందాకే మత మార్పిడి చేసుకోవాలంది.