News August 9, 2025

ట్రంప్, పుతిన్ భేటీకి డేట్ ఫిక్స్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వచ్చే శుక్రవారం (ఆగస్టు 15న) సమావేశం కానున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ అలస్కాలో జరగనుందని వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాధినేతలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Similar News

News August 9, 2025

ICICI కొత్త కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్

image

నెలవారీ కనీస సగటు నగదు నిల్వ నిబంధనలను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. మెట్రో, అర్బన్ ఏరియాల్లోని కొత్త కస్టమర్లు ఆగస్టు 1 నుంచి తమ ఖాతాల్లో రూ.50వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్‌లో రూ.25వేలు, గ్రామాల్లో రూ.5వేలు కొనసాగించాలి. నిబంధనలు పాటించకుంటే సగటు నిల్వ కొరతపై 6% లేదా రూ.500 ఏది తక్కువైతే దానిని పెనాల్టీ వేస్తారు.

News August 9, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నిర్మాతకు వార్నింగ్

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు. జీతాలు పెంచమని అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు తిరగబడితే తట్టుకోలేరని, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె తర్వాత కూడా విశ్వప్రసాద్ సినిమాలకు పనిచేయబోమన్నారు. ఆయన అసలు భారతీయుడే కాదని, ఇంగ్లిష్ కల్చర్‌ను తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.

News August 9, 2025

‘సృష్టి’ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

image

AP: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడు, విశాఖ KGH అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది.