News August 9, 2025
నేడు అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన

AP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో లగిశపల్లికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వంజంగి గ్రామానికి వెళ్తారు. గిరిజన సంప్రదాయాలపై అడవి బిడ్డలతో ముచ్చటిస్తారు. అనంతరం ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలతో భేటీ అవుతారు.
Similar News
News August 9, 2025
OBCల క్రీమీలేయర్‌ను సవరించాలని ప్రతిపాదన

OBCల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని వెంటనే సవరించాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి వల్ల చాలామంది రిజర్వేషన్లు, ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతున్నారంది. 2017లో వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు సవరించారని, దీనిని ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉందని గుర్తు చేసింది.
News August 9, 2025
మహేశ్ బర్త్‌డే.. రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్

మహేశ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాపై డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. 2025 నవంబర్‌లో మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మెడలో నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాకెట్ ధరించిన మహేశ్ ఛాతీ పిక్ షేర్ చేశారు. తమ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
News August 9, 2025
ICICI కొత్త కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్

నెలవారీ కనీస సగటు నగదు నిల్వ నిబంధనలను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. మెట్రో, అర్బన్ ఏరియాల్లోని కొత్త కస్టమర్లు ఆగస్టు 1 నుంచి తమ ఖాతాల్లో రూ.50వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్‌లో రూ.25వేలు, గ్రామాల్లో రూ.5వేలు కొనసాగించాలి. నిబంధనలు పాటించకుంటే సగటు నిల్వ కొరతపై 6% లేదా రూ.500 ఏది తక్కువైతే దానిని పెనాల్టీ వేస్తారు.