News August 9, 2025

నేడు రాఖీ పౌర్ణమి.. ఇలా చేయండి

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి(నేడు)రోజున రాఖీ జరుపుకుంటాం. ఈ రోజు ఉ.9 గంటల నుంచి 10.30 వరకు రాఖీ కట్టడానికి సుముహూర్తం ఉంది. ఉదయాన్నే తల స్నానం చేసి దీపం వెలిగించాలి. పళ్లెంలో రాఖీ, వెండి నాణెం ఉంచి పూజ చేయాలి. అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. సోదరులు ప్రేమతో వారికి కానుకలు ఇవ్వాలి. కుటుంబ సంబంధాలను దృఢపరుచుకోవడమే ఈ పండుగ ఉద్దేశం.

Similar News

News August 9, 2025

రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే?

image

రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి(ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీసివేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుందని, శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు అంటున్నారు.

News August 9, 2025

ఎల్లుండి ‘మాస్ జాతర’ టీజర్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కించిన ‘మాస్ జాతర’ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 11న ఉదయం 11.08 గంటలకు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కానుంది.

News August 9, 2025

OBCల క్రీమీలేయర్‌ను సవరించాలని ప్రతిపాదన

image

OBCల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని వెంటనే సవరించాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి వల్ల చాలామంది రిజర్వేషన్లు, ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతున్నారంది. 2017లో వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు సవరించారని, దీనిని ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉందని గుర్తు చేసింది.