News August 9, 2025

PDPL: అగ్నిపథ్, SSC GD అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

అగ్నిపథ్, SSC GD పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన PDPL జిల్లా అభ్యర్థులకు ఉచిత గ్రౌండ్ శిక్షణను ఆగస్టు 10 నుంచి అందించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 45 రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. అగ్నిపథ్‌కు 1600 మీటర్లు, GD అభ్యర్థులకు 5 KM పరుగు శిక్షణ ఉంటుందని, ఆసక్తిగల అభ్యర్థులు 9949725997, 8333044460 నంబర్లను సంప్రదించవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News August 9, 2025

రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే?

image

రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి(ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీసివేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుందని, శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు అంటున్నారు.

News August 9, 2025

వంజంగిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

image

పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొలుత వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కాఫీ తోటలను సందర్శించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయన వెంట మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ఇతర అధికారులున్నారు.

News August 9, 2025

MDK: 19 అడుగుల నీటిమట్టానికి పోచారం ప్రాజెక్టు

image

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు 19 అడుగుల నీటిమట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. వర్షాలకు ప్రాజెక్ట్ నిండుకోవడంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు. రాఖీ సెలవులు కావడంతో పర్యాటకులు వస్తున్నారు.