News August 9, 2025

అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

image

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News August 9, 2025

మహేశ్ బాబు నెట్‌వర్త్ ఎన్ని కోట్లంటే?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్, స్టూడియో, AMB సినిమాస్, ఇతర వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్నారు. మహేశ్ మొత్తం ఆస్తుల విలువ రూ.400 కోట్లకుపైనేనని అంచనా. హైదరాబాద్‌లో రూ.50 కోట్ల విలువైన ఇల్లు, ప్రైవేట్ జెట్, ముంబై, బెంగళూరులో భారీగా ఆస్తులు ఉన్నాయి. అలాగే ఆడి, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. కాగా, ఆయన తన పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి సాయం చేస్తున్నారు.

News August 9, 2025

టాప్-3లో ఏపీ, తెలంగాణ

image

ప్రజలకు సత్వర న్యాయం అందించడం, పటిష్ఠ పోలీసింగ్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో నిలిచాయి. శాంతిభద్రతల్లోనూ AP, TG టాప్‌లో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో వెల్లడైంది. 2019-24 కంటే AP ర్యాంక్ మెరుగుపడినట్లు తెలిపింది. శాంతిభద్రతలు, పోలీసింగ్ తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వగా.. 10కి 6.78 మార్కులతో కర్ణాటక మొదటి, 6.32 స్కోరుతో AP, 6.15 స్కోరుతో TG 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

News August 9, 2025

300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం: ఏపీ సింగ్

image

ఆపరేషన్ సిందూర్ చేపట్టిన 3 నెలల తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘మే 9,10 తేదీల్లో ఆపరేషన్ నిర్వహించాం. పాక్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. 300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం. ఆపరేషన్ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మన డ్రోన్ వ్యవస్థ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, లోకల్ కమాండర్స్ సమర్థంగా పనిచేశారు’ అని వెల్లడించారు.