News August 9, 2025

APPLY: రూ.96 వేల జీతంతో 550 ఉద్యోగాలు

image

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) 550 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్స్, రిస్క్ ఇంజినీర్స్, ఏఓ, బిజినెస్ అనలిస్ట్స్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ/పీజీ/బీటెక్, ఎంబీఏ/ఎంబీబీఎస్ పాసై ఉండాలి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.50,925 నుంచి రూ.96,765 వరకు ఉంటుంది. ఈ నెల 30లోగా <>newindia.co.in/recruitment<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News August 9, 2025

IPL: చెన్నైకి సంజూ? CSK ఆసక్తికర ట్వీట్

image

రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న సంజూ శాంసన్ CSKలో చేరి టీమ్ పగ్గాలు చేపడతాడని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో CSK ఆసక్తికర ట్వీట్ చేసింది. రుతురాజ్ ఫొటోను షేర్ చేస్తూ ‘గొప్ప శక్తితో పెద్ద బాధ్యత వస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తమ కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోదని పరోక్షంగా చెప్పింది. మరి RRను వీడాలనుకుంటున్న సంజూను ఏ జట్టు దక్కించుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

News August 9, 2025

334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు

image

ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు(AAP, BSP, BJP, CPI(M), INC, NPP ), 67 రాష్ట్రీయ పార్టీలు ఉన్నాయని EC ప్రకటించింది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్న రాజకీయ పార్టీల జాబితాను తాజాగా ఈసీ వెల్లడించింది. 2,854 గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల్లో 2019 నుంచి ఒక్కసారీ పోటీచేయని, ఆఫీసుల్లేని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంది. వీటిలో TGకి చెందిన 10, APకి చెందిన 5 పార్టీలున్నాయి.

News August 9, 2025

సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: కోమటిరెడ్డి

image

TG: సినీ కార్మికులకు కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వారిపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ‘మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరువర్గాలతో చర్చలు జరుపుతాం. అలాగే మల్టీప్లెక్సుల్లో దోపిడీని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.