News August 9, 2025
ఆడపడుచులకు సీఎంల రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు CMలు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీ అందరికీ అన్నగా రక్షణ కల్పించి, జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలూ పనిచేస్తా’ అని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. స్త్రీలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది’ అని TG CM రేవంత్ రెడ్డి అన్నారు.
Similar News
News August 9, 2025
TGలో రూ.80వేల కోట్ల పెట్టుబడికి NTPC సుముఖత

TG: CM రేవంత్‌తో NTPC CMD గుర్‌దీప్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడికి సుముఖత వ్యక్తం చేశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.80,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించగా, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
News August 9, 2025
IPL: చెన్నైకి సంజూ? CSK ఆసక్తికర ట్వీట్

రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న సంజూ శాంసన్ CSKలో చేరి టీమ్ పగ్గాలు చేపడతాడని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో CSK ఆసక్తికర ట్వీట్ చేసింది. రుతురాజ్ ఫొటోను షేర్ చేస్తూ ‘గొప్ప శక్తితో పెద్ద బాధ్యత వస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తమ కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోదని పరోక్షంగా చెప్పింది. మరి RRను వీడాలనుకుంటున్న సంజూను ఏ జట్టు దక్కించుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
News August 9, 2025
334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు

ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు(AAP, BSP, BJP, CPI(M), INC, NPP ), 67 రాష్ట్రీయ పార్టీలు ఉన్నాయని EC ప్రకటించింది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్న రాజకీయ పార్టీల జాబితాను తాజాగా ఈసీ వెల్లడించింది. 2,854 గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల్లో 2019 నుంచి ఒక్కసారీ పోటీచేయని, ఆఫీసుల్లేని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంది. వీటిలో TGకి చెందిన 10, APకి చెందిన 5 పార్టీలున్నాయి.