News August 9, 2025

ఉద్దానం ప్రాంత వాసుల కల ఈసారైనా నెరవేరేనా?

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట తదితర ప్రాంతాలకు పలాస దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 100 కి.మీల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News August 10, 2025

రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: అచ్చెన్నాయుడు

image

రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రైతు అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని రైతులకు రూ.186 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.

News August 10, 2025

ఆగస్టు 14న జిల్లాస్థాయిలో ప్రాచీన, గ్రామీణ క్రీడా పోటీలు

image

ఆగస్టు 14న జిల్లాస్థాయి ప్రాచీన గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహిస్తామని డీఎస్‌డీ‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళలకు కర్రసాము పోటీలు ఉంటాయన్నారు. సంగిడి, ముద్దార్, పిల్లిమొగ్గలు కేవలం పురుషులకు మాత్రమేనని చెప్పారు.

News August 9, 2025

ఆదిత్యుడి ఆలయంలో సీనియర్ సహాయకుడి సస్పెన్షన్

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శోభనాద్రి‌ని సస్పెండ్ చేశారు. ఈవో ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పారిశుద్ధ్య లోపంపై ఉన్నతాధికారుల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఈయనపై వేటు పడింది.