News August 9, 2025

గురుకుల స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: రక్షాబంధన్ సందర్భంగా ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్(VHP) డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా టీచర్లు, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆత్మీయంగా చేసుకునే రాఖీ పండుగ సందర్భంగా వాళ్లను ఇళ్లకు పంపాలని కోరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు లేఖ రాసింది.

Similar News

News August 9, 2025

రేపు EAPCET ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు

image

తెలంగాణ EAPCET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలు రేపు వెలువడనున్నాయి. విద్యార్థులు <>tgeapcet.nic.in<<>> వెబ్‌సైట్‌లో సీట్ అలాట్‌మెంట్ వివరాలను తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు రేపటి నుంచి ఈ నెల 12 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రెండు దశల్లో సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 23 నుంచి మొదలుకానున్నాయి.

News August 9, 2025

రానున్న 2 గంటల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నారాయణపేట్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 41-61కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.

News August 9, 2025

అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: CBN

image

AP: అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని CM చంద్రబాబు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు. అల్లూరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి లేకపోతే సంపద రాదని, సంక్షేమం లేకపోతే మెరుగైన జీవన ప్రమాణాలు రావని చెప్పారు. ఆ రెండు తనకు కళ్ల వంటివన్నారు. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎంతైనా ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.