News August 9, 2025
త్వరలో చేతక్, చీతా చాపర్లకు రీప్లేస్‌మెంట్!

పాతబడిన చేతక్, చీతా చాపర్లను మోడర్న్ లైట్ హెలికాప్టర్లతో భర్తీ చేయాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి విక్రేతలు, సరఫరాదారుల నుంచి సమాచారం కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(RFI)ను జారీ చేసింది. ఇవి సెర్చ్&రెస్క్యూలో పగలు, రాత్రి వేళల్లో పనిచేస్తూ సైనిక దళాలను, స్పెషల్ మిషన్ లోడ్స్‌ను తరలించేలా ఉండాలని పేర్కొంది. మొత్తం 200 హెలికాప్టర్లలో ఆర్మీకి 120, ఎయిర్‌ఫోర్స్‌కి 80 కేటాయించనుంది.
Similar News
News August 9, 2025
అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్కెస్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(9/75) చేసిన బౌలర్‌గా నిలిచారు. దీంతో విలియమ్ ఓరూర్కీ రికార్డు(9/93)ను అధిగమించారు. ఓవరాల్‌గా భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వానీ 16/136తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్&359 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించిన NZ టెస్టుల్లో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
News August 9, 2025
రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.
News August 9, 2025
విషాదం: రాఖీ కట్టి వస్తుండగా ప్రమాదం.. అక్క మృతి

TG: రాఖీ రోజున విషాదం చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టి పుట్టింటి నుంచి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్క చనిపోయింది. ములుగు జిల్లా నాంపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కిండపడటంతో పద్మ అక్కడికక్కడే మరణించింది. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. కాగా పద్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.