News August 9, 2025
చెల్లిపోని బంధం మీదమ్మా!

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.
Similar News
News August 9, 2025
నిజాంసాగర్: రాహుల్ గాంధీకి రాఖీలు పంపిన చిన్నారులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజాంసాగర్ మండలానికి చెందిన చిన్నారులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాఖీలు పంపారు. ” భారత్ కి బేటియోంకీ బాయ్ – నారి సురక్ష కా రక్షక్ రాహుల్ బయ్యా” అనే భావనతో రాఖీలు పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇమ్రోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News August 9, 2025
అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్కెస్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(9/75) చేసిన బౌలర్‌గా నిలిచారు. దీంతో విలియమ్ ఓరూర్కీ రికార్డు(9/93)ను అధిగమించారు. ఓవరాల్‌గా భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వానీ 16/136తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్&359 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించిన NZ టెస్టుల్లో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
News August 9, 2025
ఆదివాసీలకు అండగా ఉంటాం: మంత్రి కొండపల్లి

ఆదివాసీలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధి కోసం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామన్నారు. జిల్లా విడిపోయిన తర్వాత ITDA వేరయ్యిందని, అందువలన గిరిజనులకు అందవలసిన సౌకర్యాలను కోల్పోయారన్నారు.