News August 9, 2025

శ్రీకాకుళం: చెల్లిపోని బంధం మీదమ్మా!

image

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.

Similar News

News August 9, 2025

శ్రీకాకుళం: అంగట్లో ఉన్నా.. ఆన్లైన్ వైపే మొగ్గు!

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలా ఏళ్ళుగా సాంప్రదాయ పద్ధతిలో దుకాణాలు, సమీపంలో ఏర్పాటు చేసిన అంగట్లో రాఖీలు, మిఠాయిలు కొనడం ఆనవాయితీ. అయితే మారుతున్న కాలం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల వినియోగదారులు ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా రాఖీల కొనుగోళ్లు మందగించాయి. చాలా చోట్ల దుకణాలు వెలవెలబోతూ కనిపించాయి. పెట్టుబడులు కూడా రావడం కష్టమేనని చిరు వ్యాపారులు దిగులు చెందుతున్నారు.

News August 9, 2025

సరుబుజ్జిలి: వ్యక్తిపై కత్తితో దాడి

image

సరుబుజ్జిలిలోని నందికొండ కాలనీకి చెందిన పల్లి వీరవెంకట దుర్గాప్రసాద్‌పై బప్పడాం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్ కత్తితో దాడి చేసినట్లు సరుబుజ్జిలి ఎస్సై హైమావతి తెలిపారు. స్నేహితులైన వీరిద్దరూ సెల్ ఫోన్ విషయంలో గొడవపడ్డారన్నారు. గురువారం రాత్రి ప్రసాద్‌ను బప్పడాం తీసుకెళ్లి దాడి చేయడం వలన శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News August 9, 2025

ఉద్దానం ప్రాంత వాసుల కల ఈసారైనా నెరవేరేనా?

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట తదితర ప్రాంతాలకు పలాస దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 100 కి.మీల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.