News August 9, 2025
అల్లూరి: చెల్లిపోని బంధం మీదమ్మా!

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.
Similar News
News August 9, 2025
గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న చెంచుగూడాలలోని తల్లిదండ్రులు వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని పాఠశాలలకు పంపాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతి కోసం భుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
News August 9, 2025
ప్రజలకు కడప ఎస్పీ హెచ్చరిక

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
News August 9, 2025
నవీపేట్: రాఖీ కట్టుకొని వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి (అప్డేట్)

నవీపేట(M) <<17352294>>జగ్గారావు ఫారం సమీపంలో<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు బాసరకు చెందిన సాయిబాబుగా(19) పోలీసులు గుర్తించారు. అతను NZBలో ఉంటున్న తన అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి స్కూటీపై వెళ్తున్న క్రమంలో వేగంగా లారీని ఢీకొట్టాడు. దీంతో సాయిబాబు అక్కడికక్కడే మృతి చెందాడని SI తెలిపారు. స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.