News August 9, 2025

చిత్తూరు: పోలింగ్ అధికారుల వేతనాలు పెంపు

image

చిత్తూరు జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది వేతనాలు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్, సీపీఎస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, డిప్యూటీ డీఈవో, సెక్టార్ అధికారుల వేతనాలు పెంచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారులకు రూ.350 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లకు రూ.250 నుంచి రూ.400, కౌంటింగ్ అసిస్టెంట్లకు రూ.450కు పెంచారు.

Similar News

News August 9, 2025

గిరిజనులకు ఎల్లప్పుడూ సేవలందిస్తాం : కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశం మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు వారి పిల్లలను విధిగా పాఠశాలకు పంపి విద్యావేత్తలు చేయాలని సూచించారు. గిరిజనులకు ఎలాంటి సేవలు కావాలన్నా నేరుగా తనను, జేసీని సంప్రదించవచ్చన్నారు. గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.

News August 9, 2025

రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తాం: DCCB ఛైర్మన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ వ్యవసాయేతర రుణాలుగా రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు DCCB ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండోలకు ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ల విజ్ఞప్తి మేరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం 10 సింగిల్ విండోలకు అన్ని రకాల రుణాల రూపేనా రూ.70 లక్షలు అందించినట్లు తెలిపారు.

News August 9, 2025

నెలాఖరున కుప్పం రానున్న సీఎం?

image

సీఎం చంద్రబాబు ఈ నెలాఖరున కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేసేందుకు సీఎం 29 లేదా 30 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలాఖరికల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు విడుదల చేస్తామని ఇది వరకే సీఎం పేర్కొన్న నేపథ్యంలో హంద్రీనీవా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.