News August 9, 2025

ఆగస్టు 12న ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ, టేకులపల్లి)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీటెక్ బయో మెడికల్ అర్హత కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News August 12, 2025

లాభాల్లో దూసుకెళ్తున్న మహిళా మార్ట్

image

ఖమ్మం నగరంలోని మహిళామార్ట్ లాభాల్లో దూసుకెళ్తుంది. ఈ ఏడాది మే 28న మార్ట్ మొదలు కాగా రెండు నెలల్లోనే వ్యాపారం రూ.17 లక్షలు దాటింది. ఈ తరహా మార్ట్ రాష్ట్రంలో ఇదే మొదటిది. దీనిని గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రూ.30 లక్షల సెర్ప్ నిధులతో నిర్మించారు. మార్ట్ జిల్లాలో SHG సభ్యులకు ఊతంగా మారింది. అలాగే ప్రస్తుతం వందలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తుంది.

News August 12, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆప్డేట్

image

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. ఐదు నియోజకవర్గాలకు మొదటి విడతలో ప్రభుత్వం 16,153 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 12, 173 ఇళ్లకు ముగ్గుపోశారు. 6,630 బేస్‌మెంట్, 664 గోడలు, 418పై కప్పు పూర్తైయ్యాయి. 90 శాతం మందికి రూ. 61 కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

News August 12, 2025

రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్ వేలానికి ప్రభుత్వం నిర్ణయం

image

గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనల మేరకు ఖమ్మం రూరల్ పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను బహిరంగ వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, బిల్డర్లతో కలిసి బ్లాకులను పరిశీలించి, వేలం నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.