News March 31, 2024
VZM: కేంద్ర మాజీ మంత్రిని కలిసిన కూటమి అభ్యర్థులు

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కూటమి అభ్యర్థులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి.. ఆయన బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి మద్దతు పలకాలని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
Similar News
News March 7, 2026
బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.
News March 7, 2026
జాతీయ స్థాయి బ్యాట్మింటన్ పోటీలకు బొబ్బిలి వాసులు

విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన రమేష్ , వాసు 35
ఏళ్ల కేటగిరిలో పాల్గొని విజేతలుగా నిలిచారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. వీరిని బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.
News March 6, 2026
చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.


