News August 9, 2025
రాఖీ పండగ.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

రాఖీ పండగ వేళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,03,040కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేట్ రూ.250 తగ్గి రూ.94,450గా ఉంది. సిల్వర్ రేట్ కేజీకి రూ.1,27,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News August 9, 2025
వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.
News August 9, 2025
4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

APPSC అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి <<17304206>>నోటిఫికేషన్<<>> విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 జాబ్స్‌కు అప్లై చేసుకునేందుకు రేపే చివరి తేదీ. https://psc.ap.gov.inలో అప్లై చేసుకోవచ్చు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో <<17130775>>3,717<<>> గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్. https://www.ncs.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT
News August 9, 2025
2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.