News August 9, 2025

చెల్లెలి కోసం గుడి కట్టి ఆమె విగ్రహానికి పూజలు.!

image

చెల్లెలిపై ప్రేమతో ఆస్తులు, అంతస్తులు ఇచ్చిన ఘటనలు చూసింటాం. కానీ అకాల మరణం చెందిన చెల్లెలు కోసం గుడి కట్టిన ఘటన ఇది. వెంకటాచలం(M) కాకుటూరుకు చెందిన చెంచయ్య, లక్ష్మమ్మకు 5గురు సంతానం. వారిలో శివ ప్రసాద్, సుబ్బలక్ష్మి 2011లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సుబ్బలక్ష్మి చనిపోగా, శివ కోలుకున్నారు. చెల్లెలిని మరిచిపోలేని అన్న ఏకంగా గుడి కట్టి, చెల్లెలి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు.

Similar News

News August 10, 2025

మహిళలకు రూ.లక్ష సాయం చేస్తా: నారాయణ

image

నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ వద్ద స్మార్ట్ స్ట్రీట్‌లో భాగంగా కంటైనర్లతో 240 షాపులు అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ‘తొలివిడతలో 120 షాపులు ప్రారంభిస్తాం. వీటిని మెప్మా మహిళలకు కేటాయిస్తాం. ఒక్కో షాప్ ఏర్పాటుకు రూ.4 లక్షలు అవుతోంది. మెప్మా ద్వారా రూ.2లక్షల సబ్సిడీ, బ్యాంకు ద్వారా రూ.2లక్షల లోన్ తీసిస్తాం. బ్యాంకు లోనులో రూ.లక్ష చొప్పున నేను సాయం చేస్తా’ అని నారాయణ హామీ ఇచ్చారు.

News August 10, 2025

నెల్లూరు: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

image

నెల్లూరు(D) ఉలవపాడు(M) చాకిచెర్ల సమీపంలో నిన్న జరిగిన <<17348140>>ఘోర ప్రమాదంలో <<>>మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పల్నాడు(D) కొత్తగణేశునిపాడుకు చెందిన చిన వెంకటేశ్వర్లు తన పిల్లల పుట్టు వెంట్రుకలు తీయడానికి తుపాన్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. మార్గమధ్యలో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన వెంకటేశ్వర్లు భార్య సుభాషిణి, కుమారుడు అభినవ్ కృష్ణ, తల్లి వెంకట నరసమ్మ, మామ శ్రీనివాసరావు, వదిన రుక్మిణి చనిపోయారు.

News August 10, 2025

నెల్లూరులో 633 మందికి శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ

image

నెల్లూరు వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో శనివారం సాయంత్రం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. CM చంద్రబాబు వర్చువల్ విధానంలో పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. తొలి విడతలో 633 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని నారాయణ అన్నారు.