News August 9, 2025

సృష్టి కేసు అప్డేట్ : సిటీ పోలీసుల అదుపులో వైజాగ్ వైద్యులు

image

సృష్టి అక్రమ సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వైజాగ్‌ కింగ్ జార్జ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రమ్య ఉన్నారు. వీరంతా ప్రధాన నిందితురాలు నమ్రతకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 25కు చేరింది.

Similar News

News August 13, 2025

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News August 13, 2025

HYD: ఔటర్ ఆదాయం.. రూపాయల్లో రాబడి.. పైసల్లో కిరాయి..!

image

రూపాయల్లో ఆదాయం వస్తోంటే.. కిరాయి మాత్రం పైసల్లో.. ఇదీ HYD ఔటర్ రింగ్ రోడ్డు లీజు తీరు. 2023 ఆగస్టు 11 నుంచి ఐఆర్బీ సంస్థకు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు ఔటర్ లీజుకిచ్చింది. అయితే ఔటర్ ఆదాయం ఎంత వస్తోందో తెలుసా.. ఈ సంవత్సరం జూన్ వరకు రూ.414 కోట్లు వచ్చాయి. అంటే నెలకు సుమారు 70 కోట్లు.. 30 ఏళ్లకు రూ.25,200 కోట్లు (ఇప్పటి వాహనాల సంఖ్యకు).. ఇక వాహనాలు పెరిగితే.. వామ్మో డబ్బే.. డబ్బు..!

News August 13, 2025

HYD: ఓపెన్ డిగ్రీ, PGలో అడ్మిషన్లు

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీ చేయాలనుకునేవారికి ముఖ్య గమనిక. అడ్మిషన్లకు నేడు చివరి తేదీ అని అధికారులు తెలిపారు. జూన్ 14న వెలువడగా.. ఆగస్టు 13 వరకు అడ్మిషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
SHARE IT