News August 9, 2025
మహేశ్ బర్త్‌డే.. రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్

మహేశ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాపై డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. 2025 నవంబర్‌లో మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మెడలో నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాకెట్ ధరించిన మహేశ్ ఛాతీ పిక్ షేర్ చేశారు. తమ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News August 9, 2025
2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News August 9, 2025
భారత్‌పై ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ వల్ల ఏం జరుగుతుంది?

ఈ టారిఫ్స్‌ను భారత్ భరించదు. మన దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే USలోని వ్యాపారులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని పూడ్చుకోడానికి వస్తువుల ధరలు పెంచుతారు. ఫలితంగా వాటిని కొనే అమెరికా కస్టమర్లే ఆ భారం భరించాల్సి ఉంటుంది. అయితే మన కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఇతర మార్కెట్లను అన్వేషిస్తోంది. నష్టాన్ని సబ్సిడైజ్ చేసే అవకాశం లేకపోలేదు.
News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.