News August 9, 2025
రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తాం: DCCB ఛైర్మన్

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ వ్యవసాయేతర రుణాలుగా రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు DCCB ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండోలకు ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ల విజ్ఞప్తి మేరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం 10 సింగిల్ విండోలకు అన్ని రకాల రుణాల రూపేనా రూ.70 లక్షలు అందించినట్లు తెలిపారు.
Similar News
News August 10, 2025
రేపే చిత్తూరుకు బీజేపీ అధ్యక్షుడి రాక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చిత్తూరులో సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మిట్టూరులో ఛాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నాయకులతో, సాయంత్రం 4గంటలకు మీడియా, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు.
News August 10, 2025
పులిగుండుకు మేఘాల గొడుగు

చిత్తూరు జిల్లాలోనే పులిగుండు ప్రముఖ పర్యాటక కేంద్రం. పెనుమూరుకు సమీపంలో రెండు ఎత్తైన కొండలు పక్కపక్కనే ఇలా ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ పెద్ద కొండలపై నుంచి చూస్తే ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల వర్షాలతో ఈ పరిసరాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. పులిగుండుకు మేఘాలే గొడుగులా మారినట్లు నిన్న కనిపించింది. రోహిత్ అనే యువకుడు తీసిన ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.
News August 10, 2025
పులిచెర్ల: 11న పీజీఆర్ఎస్‌కు హాజరుకానున్న కలెక్టర్

పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహశీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.