News August 9, 2025

NLG: ఫేక్ అటెండెన్స్ ప్రకంపనలు..!

image

జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్‌కు సమర్పించనున్నారు. CCLA నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయవచ్చని తెలుస్తుంది. ఇంక్రిమెంట్ కట్ చేసి ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.

Similar News

News August 13, 2025

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ డీఎంహెచ్ఓ

image

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ శివారులోని పానగల్ యూపీహెచ్‌సీని ఇవాళ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. జ్వరాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.

News August 12, 2025

నల్గొండ: హ్యామ్ కింద రోడ్ల నిర్మాణానికి శ్రీకారం: మంత్రి

image

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్&బీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటి మోడ్ (హ్యామ్) కింద భారీగా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

News August 12, 2025

ఆ ఇద్దరు దద్దమ్మలే.. జగదీశ్ రెడ్డి సెటైర్

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులిద్దరూ దద్దమ్మలేనని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉదయసముద్రంను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కృష్ణా బేసిన్‌లోకి పుష్కలంగా నీరు వస్తుంటే చెరువులు నింపాల్సింది పోయి గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. జిల్లాలో చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.