News March 31, 2024
‘ఏడాదిలోపు నిజాం ఫ్యాక్టరీని తెరిపించనున్న ప్రభుత్వం’

ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
Similar News
News September 9, 2025
నవీపేట్: జార్ఖండ్‌లో యువకుడి మృతి

నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) జార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 9, 2025
ఆర్మూర్: చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెర్కిట్‌కు చెందిన ఓ మహిళ(50) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది చెరువులోకి దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు.
News September 8, 2025
NZB: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా సీనియర్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. బస్వా లక్ష్మీనర్సయ్య గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, మెదక్ జిల్లా ప్రభారిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.