News August 9, 2025
300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం: ఏపీ సింగ్

ఆపరేషన్ సిందూర్ చేపట్టిన 3 నెలల తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘మే 9,10 తేదీల్లో ఆపరేషన్ నిర్వహించాం. పాక్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. 300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం. ఆపరేషన్ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మన డ్రోన్ వ్యవస్థ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, లోకల్ కమాండర్స్ సమర్థంగా పనిచేశారు’ అని వెల్లడించారు.
Similar News
News August 10, 2025
డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్

AP: డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సవాళ్లు ఎదురైతే ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల నిర్మాణాలపై పంచాయతీరాజ్ అధికారులతో వర్చువల్‌గా ఆయన సమావేశమయ్యారు. ‘అడవితల్లి బాట’ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు అవశ్యకతను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News August 10, 2025
ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. ట్విస్ట్ ఏంటంటే?

ఛత్తీస్‌గఢ్‌లో మనీశ్ అనే యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్ చేశారు. అతడు వాడుతున్న మొబైల్ నంబర్ గతంలో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఉపయోగించడమే కారణం. 6 నెలలపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో నంబర్‌ను మనీశ్‌కు కేటాయించింది కంపెనీ. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో యువకుడి నుంచి సిమ్ తీసుకొని రజత్ పాటీదార్‌కు అప్పగించారు. తాను కోహ్లీ ఫ్యాన్ అని మనీశ్ చెప్పడం విశేషం.
News August 10, 2025
మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.