News August 9, 2025
పాడేరు: సీఎంకి రాఖీ కట్టిన మంత్రి సంధ్యారాణి

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పాడేరు మండలం వంజంగిలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాఖీ కట్టారు. అనంతరం ఆమెను సీఎం ఆశీర్వాదించారు.
Similar News
News August 10, 2025
పార్వతీపురం: PGRS అర్జీల వివరాలు తెలుసుకోవచ్చు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మీకోసం వెబ్సైట్‌లోనూ అర్జీలు నమోదు చేయవచ్చని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News August 10, 2025
డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్

AP: డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సవాళ్లు ఎదురైతే ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల నిర్మాణాలపై పంచాయతీరాజ్ అధికారులతో వర్చువల్‌గా ఆయన సమావేశమయ్యారు. ‘అడవితల్లి బాట’ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు అవశ్యకతను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News August 10, 2025
అనకాపల్లి: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

గంజాయి మత్తులో వృద్ధురాలిని రాయితో కొట్టి చంపిన ఘటనలో నిందితుడు కుదర పవన్ సాయిని కే.కోటపాడు సీఐ అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించారని చీడికాడ ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున చీడికాడ(M) ఎల్బీ పట్నానికి చెందిన గండి పైడితల్లమ్మ అనే వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన పవన్ సాయి రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.