News August 9, 2025
సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: కోమటిరెడ్డి

TG: సినీ కార్మికులకు కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వారిపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ‘మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరువర్గాలతో చర్చలు జరుపుతాం. అలాగే మల్టీప్లెక్సుల్లో దోపిడీని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 10, 2025
ముగిసిన ZPTC ఉపఎన్నికల ప్రచారం

AP: కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. వైసీపీ, టీడీపీ ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు చోట్ల 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,606గా ఉంది. ఈ నెల 12న బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనుండగా ఫలితాలు 14న వెలువడనున్నాయి.
News August 10, 2025
ఇండియన్ నేవీలో జాబ్స్.. నోటిఫికేషన్ రిలీజ్

ఇండియన్ నేవీ 1266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా ఏజ్ సడలింపు ఉంటుంది. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు indiannavy.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News August 10, 2025
మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్

ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ <<17330640>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemandను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.