News August 9, 2025

విశాఖలో వృక్షా బంధన్

image

దేశవ్యాప్తంగా 11004కు పైగా ప్రదేశాల్లో వృక్షా బంధన్ కార్యక్రమాలు జరిగాయ‌ని గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జె.వి.రత్నం తెలిపారు. శనివారం ఎంవీపీ కాలనీలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలో 60 వేల విత్తన రాఖీలు విద్యార్థులు తయారు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పిలుపుతో విత్తన రాఖీల ఉద్యమం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తించిందన్నారు.

Similar News

News August 10, 2025

సెప్టెంబర్ 14న విశాఖలో ‘నేషనల్ డాగ్ షో’

image

సెప్టెంబర్ 14న విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘నేషనల్ డాగ్ షో’ నిర్వహించనున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆర్ & బి జంక్షన్ వద్ద ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ డాగ్ షోలో దేశం నలుమూలల నుంచి ఊటి, కోడాయికెనాల్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్‌కతా, జార్ఖండ్, చత్తీస్‌‌ఘడ్ వంటి వివిధ ప్రదేశాల నుంచి 50 జాతులు, 300 శునకాలు పాల్గొంటాయన్నారు.

News August 10, 2025

గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.

News August 10, 2025

విశాఖలోని హోటల్స్‌, రెస్టారెంట్లలో తనిఖీలు

image

విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.