News August 9, 2025
TGలో రూ.80వేల కోట్ల పెట్టుబడికి NTPC సుముఖత

TG: CM రేవంత్‌తో NTPC CMD గుర్‌దీప్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడికి సుముఖత వ్యక్తం చేశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.80,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించగా, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
Similar News
News August 11, 2025
‘ఆడుదాం ఆంధ్ర’పై నేడు ప్రభుత్వానికి నివేదిక

AP: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ ముగించారు. ఇవాళ 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కిట్ల కొనుగోలు, పోటీల నిర్వహణలో రూ.40కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చినట్లు సమాచారం. మాజీమంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.
News August 11, 2025
మరో US శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో

USకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను 2 నెలల్లో లాంచ్ చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. 6,500KGs బరువుండే బ్లాక్-2 బ్లూబర్డ్ శాటిలైట్ వచ్చే నెల INDకు వస్తుందన్నారు. ఇస్రోకు చెందిన హెవీయెస్ట్ రాకెట్ LVM-3-M5 ద్వారా దీన్ని లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నాసాతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన అత్యంత ఖరీదైన <<17251299>>NISAR<<>> శాటిలైట్‌ను ఇస్రో జులై 30న విజయవంతంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
News August 11, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీనివాసుడిని 82,628 మంది భక్తులు దర్శించుకోగా 30,505 మంది తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీకి రూ. 3.73 కోట్ల ఆదాయం సమకూరింది.