News March 31, 2024

ఆర్సీబీలో ఆ ఇద్దరిని పక్కనపెట్టాలి: K శ్రీకాంత్

image

గత 3 మ్యాచుల్లో విఫలమైన పాటీదార్, అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ టీమ్ పక్కనపెట్టాలని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. వారి స్థానంలో విల్ జాక్స్, ఆకాశ్ దీప్‌ను ఆడిస్తే జట్టులో సమతూకం వస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే కోహ్లీ, జాక్స్ ఇద్దరూ ఓపెనింగ్ చేయాలని, డుప్లెసిస్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని అన్నారు. జాక్స్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతారని, అతనితో 2 ఓవర్లు వేయించవచ్చని చెప్పారు.

Similar News

News October 6, 2024

ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ పోరు

image

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

News October 6, 2024

నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.

News October 6, 2024

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే

image

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.