News August 9, 2025
జూబ్లీహిల్స్‌లో కుల రాజకీయం

జూబ్లీహిల్స్ బైపోల్ ముంగిట రాజకీయం ‘కుల’ రంగు పులుముకుంటోంది. కమ్మ కులానికి BRS అన్యాయం చేస్తోందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. CMకు ప్రేమ ఉంటే కమ్మ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. BRS కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే నిలబెడుతుందని తేల్చిచెప్పారు. అయితే, సెగ్మెంట్‌లో కమ్మ ఓట్లు 50 వేలు ఉన్నాయని, పార్టీ ఏదైనా తమకే టికెట్ ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక పట్టుబట్టడం గమనార్హం.
Similar News
News August 10, 2025
రహదారి మీద CMకు రాఖీ కట్టిన కార్పొరేటర్

CM రేవంత్‌కు అమీర్‌పేట రహదారి మీద INC మహిళా నేత రాఖీ కట్టారు. శనివారం రాత్రి కురిసిన వానకు మైత్రివనం సిగ్నల్ వద్ద రోడ్డు జలమయమైంది. ఈ నేపథ్యంలోనే CM ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం సర్కిల్‌లో వాటర్ లాగింగ్‌పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. CM ఆకస్మిక పర్యటన సమాచారం తెలుసుకొన్న కార్పొరేటర్ వనం సంగీత అక్కడికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టారు.
News August 10, 2025
HYD: సీఎం రేవంత్ రెడ్డితో యువకుల సెల్ఫీలు

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అమీర్పేట డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని చూడగానే పలువురు యువకులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. రేవంత్ రెడ్డి వారందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
News August 10, 2025
BREAKING: KPHBలో కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

KPHB PS పరిధి వసంత్‌నగర్‌లో ఆదివారం విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు.. 14 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇంటి ప్రాంగణంలో బంధువుతో కలిసి విజయ్ కార్తీక్ షటిల్ ఆడుతుండగా కాక్ ట్రాన్స్‌ఫార్మర్ మీద పడింది. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.