News August 9, 2025
రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.
Similar News
News August 10, 2025
భారీ వర్షాలు.. ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం

TG: వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కాస్త సమయం తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
News August 10, 2025
కమల్ తల నరికేస్తా.. సహనటుడి వార్నింగ్

సనాతన <<17297271>>ధర్మానికి<<>> వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు కమల్ హాసన్‌ను సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులకు గురిచేశారు. కమల్ తల నరికివేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రవిచంద్రన్‌పై మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధం విద్య అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
News August 10, 2025
పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.