News August 9, 2025
సౌర ఫలకాల ఏర్పాటు: నిర్మల్ అదనపు కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వివరాలను వారంలోగా అందివ్వాలన్నారు.
Similar News
News August 13, 2025
BREAKING: భారీ వర్షాలు.. రెండ్రోజులు స్కూళ్లకు సెలవులు

TG: భారీ వర్ష సూచన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రేపు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది.
News August 13, 2025
మార్ఫింగ్ కేసు: ముగిసిన RGV విచారణ

AP: ఒంగోలు తాలూకా పీఎస్‌లో రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. ఫొటోల మార్ఫింగ్ కేసులో దాదాపు 11 గం.పాటు RGVని పోలీసులు విచారించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆయన ‘X’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ.2 కోట్లు అందడంపై కూడా విచారించినట్లు సమాచారం.
News August 13, 2025
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.