News August 9, 2025

నిజాంసాగర్: రాహుల్ గాంధీకి రాఖీలు పంపిన చిన్నారులు

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజాంసాగర్ మండలానికి చెందిన చిన్నారులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాఖీలు పంపారు. ” భారత్ కి బేటియోంకీ బాయ్ – నారి సురక్ష కా రక్షక్ రాహుల్ బయ్యా” అనే భావనతో రాఖీలు పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇమ్రోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News August 13, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం భూషణరావుపేటలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడానికి చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.

News August 13, 2025

కేయూ దూరవిద్య ప్రవేశాల గడువు పెంపు..!

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025-26కి ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్ లాల్ తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఎఐఎస్ సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ ఎస్సీ కోర్సుల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలన్నారు.

News August 13, 2025

పాఠశాల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: నంద్యాల కలెక్టర్

image

పాఠశాల విద్య అభివృద్ధి రాష్ట్ర, దేశ అభివృద్ధికి పునాది అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి స్కూలింగ్, బిల్డింగ్ బ్లాక్ వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.