News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
Similar News
News August 10, 2025
టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్స్ వారే: సాయిధరమ్ తేజ్

టాలీవుడ్‌లో మోస్ట్ స్టైల్ ఐకాన్ రామ్ చరణ్ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్(SDT) చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అని తెలిపారు. నిన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుకలో మోస్ట్ డిజైరబుల్(మేల్) అవార్డును SDT సొంతం చేసుకున్నారు. అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరెంజ్ మూవీలో RC లుక్స్ తన ఆల్‌టైం ఫేవరెట్ అని పేర్కొన్నారు.
News August 10, 2025
హోరాహోరీ ఫైట్.. ఇద్దరు బాక్సర్లు మృతి

జపాన్ బాక్సింగ్ ఈవెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టోక్యో కొరాకువెన్ హాల్ పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు గాయాలపాలై మృతిచెందారు. ఈనెల 2న షిగెటోషీ కొటారీ(28) 12 రౌండ్ల హోరాహోరీ ఫైట్ తర్వాత రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. తర్వాతి రోజు మరో మ్యాచ్‌లో హిరోమాసా ఉరకావా(28) ఫైనల్ రౌండ్లో నాకౌట్ అయ్యారు. వీరిద్దరూ బ్రెయిన్ ఇంజూరీస్‌తోనే మరణించడం గమనార్హం. ఈ విషయాన్ని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవాళ వెల్లడించింది.
News August 10, 2025
రాష్ట్ర గణేశ్ ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక

AP: రాష్ట్ర గణేశ్ ఉత్సవ సమితి కమిటీని ఇవాళ ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, అధ్యక్షుడిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా, అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.