News August 9, 2025

చీరాలలో గవర్నర్‌ను కలిసిన MLA కొండయ్య

image

చీరాలలో వాడరేవు ఐటీసీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును ఎమ్మెల్యే కొండయ్య గవర్నర్‌కు వివరించారు.

Similar News

News August 13, 2025

HYD: ఇంజనీరింగ్ వైపు ఆసక్తి తగ్గుతుందా?

image

ఇంజినీరింగ్ విద్య వైపు ఆసక్తి తగ్గుతుందా? అంటే ప్రస్తుత గుణాంకాలతో అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 55.8% మాత్రమే సీట్ల భర్తీ అయ్యాయి. మిగిలినవి స్పాట్ కౌన్సెలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే 15 శాతానికిపైగా సీట్లు గ్రేటర్ పరిధిలో మిగిలాయి. మరోవైపు B TECH ఇంజినీరింగ్ సీట్లు సైతం మిగలటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

News August 13, 2025

VKB: ‘భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

News August 13, 2025

గూగుల్‌ క్రోమ్ కోసం ‘పెర్‌ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

image

GOOGLE క్రోమ్ కోసం పెర్‌ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్‌కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్‌ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్‌లైన్ సెర్చ్‌లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్‌ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్‌ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.