News August 9, 2025
మెదక్: 2,11,964 మందికి ఆల్బెండజోల్

మెదక్ జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల 2,11,964 మందికి నులిపురుగుల నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. 11న సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని మాత్రలను వేస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీలు, విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలల్లో మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 9, 2025
చిలిపిచేడ్: విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిట్కూల్ గ్రామానికి చెంది భవానిపల్లి కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లి గడ్డి కోత మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
News September 9, 2025
MDK: కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేసీఆర్

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలు చేశామని అన్నారు.తన పుట్టక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ అన్నారు
News September 9, 2025
మెదక్: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్

టేక్మాల్ మండలం ధనురా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత, విద్య బోధన తదుపరి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడి పాటలు బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రియాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.