News August 9, 2025
రికార్డు స్థాయిలో భారత రక్షణ ఉత్పత్తులు

భారత డిఫెన్స్ ప్రొడక్షన్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,50,590 కోట్లకు చేరింది. ఈ మేరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రూ.1.27 లక్షల కోట్లు ఉన్న ప్రొడక్షన్ వాల్యూ ఇప్పుడు 18 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తుల్లో పబ్లిక్ సెక్టార్ వాటానే 77% కావడం విశేషం. దిగుమతులు తగ్గించుకుని ఇతర దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే దిశగా భారత్ సాగుతోంది.
Similar News
News August 13, 2025
ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్నిగంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. HYDలోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది.
News August 13, 2025
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
News August 13, 2025
పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.