News August 10, 2025

రాఖీ పండుగ.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో

image

TG: నవ్వుతూ సోదరుడికి రాఖీ కట్టాల్సిన రోజు ఐదుగురు అక్కలు తమ్ముడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రానికి చెందిన యాకయ్య (50) అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఐదుగురు అక్కలు కంటతడి పెడుతూ తమ్ముడి ఇంటికి చేరుకున్నారు. ఆపై మృత‌దేహానికి చివరిసారి రాఖీ కట్టి విలపించారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News August 10, 2025

చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

image

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.

News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.

News August 10, 2025

ఉద్యోగి రిజైన్.. HRకు నెటిజన్స్ చివాట్లు!

image

ఓ ఉద్యోగి ఫస్ట్ శాలరీ అందిన 5ని.కే రిజైన్ చేశారు. ఇంకేముంది సదరు ఉద్యోగిని ఆ HR తప్పుబట్టారు. ‘వారాల కొద్దీ ట్రైనింగ్, గంటల కొద్దీ పేపర్ వర్క్ చేశాం. ఇంత సెల్ఫిష్‌గా రిజైన్ చేస్తారా? ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇబ్బందుంటే మాట్లాడాలి, సహాయం కోరాలి’ అని పోస్ట్ చేశారు. నెటిజన్స్ ఆ ఉద్యోగినే సమర్థించారు. ‘ప్రొబేషన్‌లో మీకు నచ్చకపోతే తీసేస్తారు, లేఆఫ్స్ అంటూ తీసేస్తున్నారుగా’ అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.