News August 10, 2025
త్వరలోనే మహిళలకు రూ.18వేలు: ఎంపీ కేశినేని చిన్ని

AP: కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కొక్కటిగా విజయవంతంగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుందని చెప్పారు. ఆ తర్వాత త్వరలోనే ‘స్త్రీ నిధి’ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500(ఏటా రూ.18,000) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.
Similar News
News August 10, 2025
చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.
News August 10, 2025
బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.
News August 10, 2025
ఉద్యోగి రిజైన్.. HRకు నెటిజన్స్ చివాట్లు!

ఓ ఉద్యోగి ఫస్ట్ శాలరీ అందిన 5ని.కే రిజైన్ చేశారు. ఇంకేముంది సదరు ఉద్యోగిని ఆ HR తప్పుబట్టారు. ‘వారాల కొద్దీ ట్రైనింగ్, గంటల కొద్దీ పేపర్ వర్క్ చేశాం. ఇంత సెల్ఫిష్‌గా రిజైన్ చేస్తారా? ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇబ్బందుంటే మాట్లాడాలి, సహాయం కోరాలి’ అని పోస్ట్ చేశారు. నెటిజన్స్ ఆ ఉద్యోగినే సమర్థించారు. ‘ప్రొబేషన్‌లో మీకు నచ్చకపోతే తీసేస్తారు, లేఆఫ్స్ అంటూ తీసేస్తున్నారుగా’ అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.