News August 10, 2025

ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థుల అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల విద్యార్థులకోసం అదనపు నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో కేటాయించిన 25% సీట్లలో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈనెల 12-20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. AUG 21న అర్హత నిర్ధారణ, 25న లాటరీ ఫలితాలు, ఆగస్టు 31న అడ్మిషన్ల ఖరారు ఉంటుంది. అడ్రస్ కోసం ఆధార్/ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణకు రేషన్ కార్డు సరిపోతుంది.

Similar News

News August 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* బెంగళూరులో 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ
* TG: హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన సీఎం రేవంత్
* అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
* తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్
* AP: డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్
* చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్
* రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

News August 11, 2025

భారత డ్యామ్‌ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

image

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్‌తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News August 10, 2025

ఈసీ ఆదేశాలు TDP బేఖాతరు చేస్తోందంటూ YCP విమర్శలు

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ప్రచారం సా.5గంటలతో ముగిసింది. అయినా, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్ట వేశారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హరిత హోటల్‌ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి నేతలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.