News August 10, 2025

భీమవరం: పోలీస్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

పోలీసుల ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తెలిపారు. భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం పోలీసు క్రికెట్ లీగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఉత్తమ సాధనమని ఎస్పీ అన్నారు. ఈ లీగ్‌లో జిల్లా నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.

Similar News

News August 13, 2025

పోడూరు తహశీల్దార్‌కి కలెక్టర్ అభినందనలు

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.లక్ష డ్రాఫ్ట్‌ను అందించిన పోడూరు తహశీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అభినందించారు. తహశీల్దార్లందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి రెడ్ క్రాస్‌కు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News August 12, 2025

నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలి: కలెక్టర్

image

చినఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కలెక్టర్ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. ఆమె విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల మాత్రలు వేశారు. పిల్లలు ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని కలెక్టర్ సూచించారు. నులిపురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు.

News August 12, 2025

భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా

image

మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురుకు భీమవరం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సోమవారం జరిమానా విధించారు. రూరల్ ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన కొవ్వాడ సెంటర్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నాగరాజు, సురేశ్, వెంకన్న, చిన్న మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుపడ్డారరు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నలుగురికి రూ.40,000 జరిమానాను మెజిస్ట్రేట్ విధించారు.