News August 10, 2025

పాతబస్తీలో పెడిస్ట్రియన్ జో‌న్‌‌.. మీ కామెంట్?

image

HYD నగర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. పాతబస్తీ ఏరియాలో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దీంతో పాటు పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టాలని CM రేవంత్ రెడ్డి తాజా మీటింగ్‌లోనూ అధికారులకు సూచించారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి లాంటి రద్దీ ఏరియాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌ల కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని CM ఆదేశించారు. దీనిపై మీరేమంటారు?

Similar News

News August 13, 2025

HYD: మీ దానం.. స‘జీవం’

image

తాను మరణించినా మరొకరు బతకాలనే ఆలోచన గొప్పది. ఈ విషయంలో HYD దాతలకు చేతులెత్తి మొక్కాల్సిందే. ఇటీవల నార్సింగికి చెందిన డా.భూమిక బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం చేసి ఆరుగురికి ప్రాణం పోసింది. గతంలో CYB కానిస్టేబుల్ ఆంజనేయులుకు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఆర్గాన్ డొనేట్ చేసి, 8 మందికి ప్రాణం పోశాడు. ఇలాంటి దాతలు సిటీలో ఎందరో ఉన్నారు. వారికి సెల్యూట్ చేద్దాం.
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.

News August 13, 2025

భారీ వర్షాలు.. HYD వాసులకు పోలీసుల సూచనలు

image

☛15వ తేదీ వరకు వర్ష సూచన
☛సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం
☛అత్యవసరం ఉంటేనే బయటకురావాలి
☛వెదర్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోండి
☛వాహనాల కండీషన్ పరిశీలించండి
☛నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్త
☛వర్షంలో చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర నిలబడొద్దు
NOTE: జాగ్రత్తలు పాటించండి.. క్షేమంగా గమ్యం చేరండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

News August 13, 2025

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.