News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.

Similar News

News August 10, 2025

అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి

image

TG: పంచాయతీ మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుపై కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజైన్లు, వివరాల కోసం ప్రశ్నావళిని పంపుతామన్నారు.

News August 10, 2025

అరకు కాఫీకి టాటా బ్రాండింగ్

image

AP: అరకు కాఫీని బ్రాండింగ్ చేసేందుకు టాటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇకపై విదేశాల్లో సహా పలు ప్రాంతాల్లో టాటానే మార్కెటింగ్ చేయనుంది. అలాగే మన్యంలో 1600 హెక్టార్లలో కాఫీ తోటల విస్తరణకు ITC, రంపచోడవరంలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు ITDAతో కేంద్రీయ రబ్బరు బోర్డు MOU చేసుకుంది. చింతపల్లిలో రెడ్‌చెర్రీ పండ్ల రిఫైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సబ్ కో ముందుకొచ్చింది.

News August 10, 2025

స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.220 వరకు ఉంది. విజయవాడ, గుంటూరులో రూ.210, విశాఖపట్నం రూ.190, వరంగల్‌ రూ.200, నల్గొండ రూ.193, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.