News August 10, 2025
ఇప్పటి పరిస్థితులపై.. వందేళ్ల క్రితం కార్టూన్

USకు చెందిన కార్టూనిస్ట్ బాబ్ మైనర్ వెస్ట్రన్ కంట్రీస్‌పై వేసిన ఓ కార్టూన్ వైరలవుతోంది. ‘డబ్బు, తుపాకులతో అమెరికా, ఫ్రెంచ్, బ్రిటీషర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికైనా ప్రజలు ఎక్కువగా ఉన్న చైనా, భారత్, ఆఫ్రికా దేశాలు తిరిగి నిలబడతాయి, లెక్క సరిపోతుంది’ అని 1925లోనే కార్టూన్ వేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆ కార్టూన్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News August 11, 2025
ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ ధరలు రూ.1,279, విదేశాలకు సంబంధించి రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.200 అదనంగా చెల్లించాలని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయంది. ఈ నెల 19 నుంచి 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
News August 11, 2025
నేటి నుంచి షూటింగ్స్ బంద్.. నేతలు పరిష్కారం చూపేనా?

టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. తమ డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఇవాళ్టి నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు. మరోవైపు ఇదే విషయమై నిర్మాతలు ఏపీ మంత్రి దుర్గేశ్‌ని కలుస్తారని తెలుస్తోంది. నాయకులైనా ఈ బంద్‌కు శుభం పలుకుతారేమో చూడాలి.
News August 11, 2025
9th క్లాస్ విద్యార్థులకు ‘ఓపెన్ బుక్’ పరీక్షలు

9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలను స్టూడెంట్స్ బుక్స్ చూస్తూ రాయొచ్చు. అయితే స్కూళ్లు దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదని బోర్డు తెలిపింది. మరోవైపు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.