News March 31, 2024
సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల
AP: వాలంటీర్లపై EC ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి. మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కడుపు మంటతోనే వాలంటీర్ల సేవలను EC ద్వారా నిలుపుదల చేశారని విమర్శించారు.
Similar News
News January 4, 2025
సౌతాఫ్రికా క్రికెటర్ సరికొత్త ఘనత
సౌతాఫ్రికా ప్లేయర్ ర్యాన్ రికెల్‌టన్ సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో తొలి సారి ఓపెనింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రికెల్‌టన్ (214*) డబుల్ సెంచరీ సాధించారు. ఈ క్రమంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (201*) రికార్డును ఆయన అధిగమించారు. వీరి తర్వాత గ్రేమీ స్మిత్ (200), కాన్వే (200), శిఖర్ ధవన్ (187), రోహిత్ శర్మ (176), జైస్వాల్ (171) ఉన్నారు.
News January 4, 2025
‘హరిహరవీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మాట వినాలి’ అనే సాంగ్‌ను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
News January 4, 2025
పోలవరం ప్రభావంపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం
TG: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. 2022లో గోదావరికి వచ్చిన వరదలతో భద్రాచలం ఆలయం ముంపునకు గురైందని తాజా సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు.