News March 31, 2024

కడప జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

image

ఏప్రిల్ రెండవ తేదీన కడప జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడపలో తెలిపారు. 28వ తేదీ కడపలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడగా.. ఏప్రిల్ 2న కడపలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొనడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.

Similar News

News March 24, 2026

ఉమ్మడి కడప జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

image

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో <<19460921>>10 అసెంబ్లీ<<>> స్థానాలు ఉండగా ఆ సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.

News March 23, 2026

కడప: ఇవాళ్టి పరీక్షకు 27,677 మంది హాజరు!

image

కడప జిల్లాలో 167 కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి గణితం పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 27,861 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,677 మంది పరీక్షలు రాశారు. 184 మంది ఆబ్సెంట్ అయ్యారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 సెంటర్లను, 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలు జరిగాయి. 2,386 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,989 మంది రాశారు. 397 మంది గైర్హాజరయ్యారు.

News March 23, 2026

కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

image

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.